సరస్సులో పడవ బోల్తా.. 12 మంది మృతి

59చూసినవారు
సరస్సులో పడవ బోల్తా.. 12 మంది మృతి
తూర్పు కాంగోలోని కివు సరస్సులో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వ్యాపారులు, ప్రయాణికులతో వెళ్తున్న పడవ శనివారం రాత్రి ఇద్జ్వీ ద్వీపం సమీపంలో బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. 20 మందికిపైగా గల్లంతయ్యారు. పడవలో 50 మందికిపైగా ఉన్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 15 మందిని రక్షించారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్