AP: నెల్లూరులోని పెన్నానది బ్యారేజీ సమీపంలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. రోడ్డుపై రక్తం పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఇద్దరు యువకులను హత్య చేసి పెన్నానదిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాల కోసం పెన్నానదిలో పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.