కవల పిల్లలకు వేర్వేరు తండ్రులు.. డీఎన్ఏ పరీక్షలో షాకింగ్ నిజం

32చూసినవారు
కవల పిల్లలకు వేర్వేరు తండ్రులు.. డీఎన్ఏ పరీక్షలో షాకింగ్ నిజం
ఒకే తల్లికి జన్మించిన కవలలకు వేర్వేరు తండ్రులు ఉండటం సాధ్యమేనని బ్రిటన్‌లో జరిగిన అరుదైన ఘటన ద్వారా తేలింది. ఇద్దరు సోదరీమణుల 2022లో చేసుకున్న DNA పరీక్షల్లో తమ తండ్రులు వేర్వేరని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. జీవశాస్త్రంలో దీనిని 'హెటెరోపాటర్నల్ సూపర్‌ఫెకండేషన్' అంటారు. ఒకే రుతుచక్రంలో విడుదలైన రెండు అండాలు వేర్వేరు వ్యక్తుల శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా కనిపించే ఈ కేసు బ్రిటన్‌లో నమోదైన తొలి ఘటనగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వారి 49 ఏళ్ల కాగా, తమ మధ్య ఉన్న బంధం ఎప్పటికీ మారదని ఆ ట్విన్ సిస్టర్స్ తెలిపారు.

సంబంధిత పోస్ట్