మహబూబాబాద్ జిల్లా చిన్నారుల హత్య కేసులో ట్విస్ట్ (వీడియో)

41241చూసినవారు
TG: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో ఉపేందర్-శిరీష దంపతుల ఇంట్లో దారుణం చోటుచేసుకుంది. భర్త అనుమానం, మద్యానికి బానిసయ్యాడని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న శిరీష, తనతో పాటు పిల్లలు కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది జనవరిలో చిన్న కొడుకు నిహాల్ (4)ను నీటి సంపులో పడేసి హత్య చేసింది. గత నెలలో మరో కుమారుడు మనీష్ (6)ను మెడకు తాడు చుట్టి హతమార్చింది. భర్తపై కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిన శిరీషను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్