TG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో శివసత్తు హత్య కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శివసత్తు సుధాకర్ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడిని తరచూ లైంగికంగా వేధించేవాడని తేలింది. అది భరించలేకే ఆ యువకుడు తన స్నేహితుడి సాయంతో హత్య చేసి నగదు, నగలతో పరారైనట్లు గుర్తించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు.