భారత నౌకాదళ రహస్యాలు విదేశాలకు: ఇద్దరి అరెస్ట్

15597చూసినవారు
భారత నౌకాదళ రహస్యాలు విదేశాలకు: ఇద్దరి అరెస్ట్
భారత నౌకాదళ నౌకలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన ఆరోపణలపై ఉడుపి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. యూపీకి చెందిన నిందితుడు రోహిత్, కోచిన్ షిప్‌యార్డ్‌కు సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ, నౌకల సంఖ్య వంటి రహస్య వివరాలను వాట్సాప్ ద్వారా విదేశీయులకు పంపినట్లు తేలింది. మాల్పే యూనిట్‌కు బదిలీ అయినప్పటికీ, అతని గూఢచర్య కార్యకలాపాలు ఆగలేదు. కోచిన్ షిప్‌యార్డ్ సీఈఓ ఫిర్యాదు మేరకు ఈ అరెస్టులు జరిగాయి. వీరిద్దరిని డిసెంబర్ 3 వరకు న్యాయ కస్టడీకి అప్పగించారు.

ట్యాగ్స్ :