ఆస్తి కోసం మరదలిని చంపిన ఘటనలో ఇద్దరు అరెస్టు

9చూసినవారు
ఆస్తి కోసం మరదలిని చంపిన ఘటనలో ఇద్దరు అరెస్టు
TG: మహబూబ్‌నగర్ జిల్లాలో ఆస్తి కోసం మరదలిని చంపిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేసి, రిమాండుకు తరలించారు. ఈ నెల 2న కోయిలకొండ మండలం చింతలతండాకు చెందిన సునీత హత్యకు గురైంది. భూవివాదాల్లో అత్తింటి వాళ్లే హత్య చేసినట్లు బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులు మాన్య నాయక్, పార్వతీని అరెస్ట్​ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్