AP: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నకరికల్లు మండలానికి చెందిన ఒక మహిళను.. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కొత్తపల్లి సుధాకర్, అతని సోదరుడు శ్రీను కలిసి బెదిరించి, వీడియోలు తీస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో, బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుధాకర్ సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు, అతనిపై గతంలోనూ పలు మోసపూరిత కేసులు ఉన్నట్లు సమాచారం.