
‘కాంతార 1’ ప్రీమియర్, టికెట్ ధరల పెంపునకు ఓకే చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కాంతార 1’ సినిమాకు ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 2 నుంచి 11 వరకు టికెట్ ధరలు పెంచడానికి వీలు కల్పించారు. సింగిల్ స్క్రీన్‌లో జీఎస్టీతో రూ. 75, మల్టీప్లెక్స్‌లో రూ. 100 వరకు ధరలు పెంచుకోవచ్చంది. ఈ పరిమాణం ప్రీమియర్ షోలకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.




