శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలానికి చెందిన బిత్తరబంధలో ఉమ్మెత్త కాయలు తిన్న సవర విక్రమ్ (4), సవర గంగు (3) అనే ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు మొదట స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో హరిపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని 108 అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.