రెండ్రోజుల క్రితమే నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌.. 12వ అంతస్తు నుంచి పడి మృతి

8232చూసినవారు
రెండ్రోజుల క్రితమే నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌.. 12వ అంతస్తు నుంచి పడి మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో 14 ఏళ్ల 9వ తరగతి విద్యార్థిని ప్రాచి 12వ అంతస్తు నుంచి పడి మృతి చెందింది. శుక్రవారం రాత్రి రాజ్‌నగర్‌ రెసిడెన్సీ టవర్‌-జీలో ఆరబెట్టిన బట్టలు తీసుకునేందుకు బాల్కనీలోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన సీబీఎస్‌ఈ జాతీయ రోప్‌ స్కిప్పింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రాచి రెండు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్