
ఎల్లుండి రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 6 గంటల్లో అది గంటకు 6 కి.మీ. వేగంతో కదిలిందని పేర్కొంది. రాబోయే 24 గంటల్లో తుఫాన్‌గా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్సుంది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.




