TG: వాగులో పడిన బాబును కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందారు. నల్లగొండ జిల్లా దేవరకొండ దేవరచర్లలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దిండి వాగులో పడిపోయిన ఓ బాబును కాపాడే క్రమంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు తెనాలి నుండి పండగకు బంధువుల ఇంటికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కాగా బాబు ఆచూకీ కోసం స్థానిక గాలింపు చర్యలు చేపట్టారు. పండగ వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.