పిడుగుపాటుతో ఫోన్లు పేలి ఇద్దరు రైతుల తీవ్ర గాయాలు

5481చూసినవారు
పిడుగుపాటుతో ఫోన్లు పేలి ఇద్దరు రైతుల తీవ్ర గాయాలు
TG: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బొప్పాజీవాడ శివారులో ఆదివారం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. బొప్పాజీవాడకు చెందిన మేకల సూర్యకాంత్, బూర్గులకు చెందిన గైని శంకర్ పత్తి చేనులో పనిచేస్తుండగా వర్షం రావడంతో గొడుగు పట్టుకుని నిలబడ్డారు. ఈ క్రమంలో పిడుగు పడడంతో వారి వద్ద ఉన్న ఫోన్లు పేలిపోయి, ఇద్దరూ స్పృహతప్పి పడిపోయారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్