కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

16284చూసినవారు
కెనడాలో విమాన ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
కెనడాలో విమాన శిక్షణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. మృతులను తమిళనాడుకు చెందిన మనోజ్‌ శివకుమార్‌, పుదుచ్చేరికి చెందిన శ్రీశరన్‌ తిరుజ్ఞానసంబంధంగా గుర్తించారు. వాంకువర్‌లోని భారత కాన్సులేట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఘటనపై కాన్సులేట్‌ సోషల్‌ మీడియాలో సంతాపం వ్యక్తం చేసింది. మృతుల భౌతికకాయాలను భారత్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది.

సంబంధిత పోస్ట్