
ప్రియుడితో పారిపోయిన భార్య.. పిల్లలతో కలిసి నదిలో దూకిన భర్త
ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు భార్య ప్రియుడితో పారిపోవడంతో భర్త సల్మాన్ నలుగురు పిల్లలతో కలిసి యమునా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దూకే ముందు భార్య, ఆమె ప్రియుడే తమ చావుకు కారణమని వీడియోలో పేర్కొని సోదరికి పంపాడు. పోలీసులు గజ ఈతగాళ్లతో నదిలో గాలింపు కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




