రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

59చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
TG: నల్గొండ జిల్లా, దేవరకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారి (167) పై కొండ భీమనపల్లి గ్రామ శివారులో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు లారీ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు మహిళ కాగా మరొకరు పురుషునిగా గుర్తుంచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్ట్ నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్