బైక్ చోరీల కేసులో ఇద్దరు అరెస్ట్.. 8 వాహనాలు స్వాధీనం

3000చూసినవారు
బైక్ చోరీల కేసులో ఇద్దరు అరెస్ట్.. 8 వాహనాలు స్వాధీనం
TG: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస దొంగతనాలపై ఫిర్యాదులు రావడంతో సీసీ ఫుటేజీని పరిశీలించి, కూకట్‌పల్లి నల్లకుంట చెరువు కట్ట పార్క్‌కు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాస్, డీఐ మహమ్మద్‌మక్సూద్ అలీ, డీఎస్ఐ వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. వారి వద్ద నుంచి 8 ద్విచక్ర వాహనాలు, గణేశ్ మండపం వద్ద దొంగలించిన ఒక స్పీకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్