హైదరాబాద్కు మరో రెండు వందే భారత్ రైళ్లు

14046చూసినవారు
హైదరాబాద్కు మరో రెండు వందే భారత్ రైళ్లు
మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ నగరానికి మరో రెండు వందే భారత్ రైళ్లు రానున్నాయి. హైదరాబాద్ నుంచి పుణె, సికింద్రాబాద్ నుంచి నాందేడ్ మధ్య ఈ కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు రైళ్లు అందుబాటులోకి వస్తే, సికింద్రాబాద్ నుంచి పుణె మధ్య ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో ఒక వందే భారత్ రైలు నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నాలుగు వందే భారత్ రైళ్లు వివిధ నగరాలకు నడుస్తున్నాయి.