
నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి వ్యక్తి దారుణ హత్య (వీడియో)
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సందీప్ సింగ్ అనే ప్రాపర్టీ డీలర్ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుండగా, ఓ దుండగుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపి, అనంతరం బైక్పై పరారయ్యాడు. ఈ కాల్పుల్లో సందీప్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




