LIC తన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 7 నుంచి అందుబాటులోకి రానున్న రెండు కొత్త బీమా ప్లాన్లను ప్రకటించింది. బీమా ప్లాటినమ్ (ప్లాన్ నం 770) అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ ప్లాన్. ఇది పొదుపుతో పాటు ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఇందులో వెయ్యి రూపాయలకు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. కనీస వయసు 28, గరిష్ఠ వయసు 75 ఏళ్లు. జీవన్ రక్ష (ప్లాన్ నం 894) అనేది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇది కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. కనీస వయసు 18, గరిష్ఠ వయసు 45 ఏళ్లు. ఈ రెండు ప్లాన్లలోనూ రైడర్లు జోడించుకునే వెసులుబాటు ఉంది.