AP: శ్రీసత్యసాయి జిల్లా దామాజుపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ఐచర్ వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
- ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ దగ్గర భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.