
దక్షిణ కొరియాలో పెళ్లి విందు.. నగదు కానుక తప్పనిసరి (VIDEO)
దక్షిణ కొరియాలో పెళ్లికి వెళ్లే అతిథులు భోజనం చేయాలంటే ముందుగా నగదు రూపంలో కానుక ఇవ్వాల్సిందే. ‘చుగిగుమ్’ అని పిలిచే ఈ ఆచారంలో భాగంగా, ప్రత్యేక డెస్క్ వద్ద కవర్లో నగదు ఇచ్చి పేరు నమోదు చేసుకున్నాకే భోజనానికి టోకెన్ ఇస్తారు. కొత్త జంట ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వారి కొత్త ఇంటి ఖర్చులకు తోడ్పడటానికే ఈ పద్ధతిని పాటిస్తారు. భవిష్యత్తులో ఆ అతిథుల ఇళ్లలో పెళ్లిళ్లు జరిగినప్పుడు ఇచ్చినంత నగదును తిరిగి ఇవ్వడం కూడా ఇక్కడ ఆనవాయితీ. ప్రస్తుతం ఇందులో డిజిటల్ పేమెంట్లు కూడా వాడుకలోకి వస్తున్నాయి.




