భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు.. పేపర్‌లో యాడ్ వేసి మరి!

54చూసినవారు
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు.. పేపర్‌లో యాడ్ వేసి మరి!
AP: వింతలకు వేదికైన సోషల్ మీడియా మరోసారి ఆశ్చర్యపరిచింది. ఆల్రెడీ ఇద్దరు భార్యలున్న ఓ వ్యక్తికి, మూడో పెళ్లి చేసుకున్న సంఘటన చర్చనీయాంశమైంది. కోనసీమ జిల్లా కీందూరు గ్రామంలో జరిగిన ఈ పెళ్లికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ‘పండన్న వెడ్స్ లావ్య’ అంటూ బ్యానర్లు కట్టి, పేపర్‌లో యాడ్‌ వేసి, అతిథులను ఆహ్వానించారు. పెళ్లి ఆహ్వానదారులుగా మొదటి భార్య పార్వతమ్మ, రెండో భార్య అచ్చలమ్మ పేర్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్