AP: టార్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో జరిగింది. పట్టణంలోని సైదాపేటకు చెందిన సాదియా రీలింగ్ పనిచేసేందుకు వెలుతు తన కుమార్తె అలిజ(2)ను తీసుకెళ్లింది. చంద్రకాలనీ రీలింగ్ కేంద్రంలో వదలడంతో చిన్నారి నీళ్లు అనుకోని టార్పెంట్ ఆయిల్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది.