ముంబయిలోని గోరేగావ్ తూర్పు రామమందిర్ రైల్వే స్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. పబ్లిక్ టాయిలెట్లో విషవాయువు పీల్చి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను ప్రభాకర్ ధనివర్ (24), భావిక్ దేశాయ్ (18)గా గుర్తించారు. గణేశ్ నిమజ్జనం అనంతరం శుక్రవారం రాత్రి ఇద్దరూ టాయిలెట్‌కు వెళ్లారు. అరగంటైనా తిరిగి రాకపోవడంతో సహచరులు వెళ్లి చూడగా.. తీవ్ర రసాయన దుర్వాసన మధ్య అపస్మారక స్థితిలో కనిపించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టాయిలెట్ పక్కనే ఉన్న పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలు డ్రైనేజీలోకి చేరి విషవాయువు ఏర్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.