
రేషన్ కార్డులపై మోదీ ఫోటో ముద్రించాలి: ఎంపీ రఘునందన్ రావు
తెలంగాణలో కొత్తగా అందించే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎక్కువ ఉన్నప్పటికీ సీఎం, మంత్రుల ఫోటోలు మాత్రమే ముద్రించుకోవడం సరికాదని, సిద్ధం చేసిన కార్డులను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు రకాల నిత్యావసర వస్తువులను అందిస్తుంటే, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు ఇవ్వడంలేదని ఆయన నిలదీశారు.




