
IND VS Sl: టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
మహిళల వన్డే ప్రపంచకప్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో భారత్, శ్రీలంక గువాహటి వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. స్వదేశంలో ఆడుతున్న భారత మహిళల జట్టు, ఇటీవలి ప్రదర్శన ఆధారంగా భారీ అంచనాల మధ్య బ్యాటింగ్ ప్రారంభించింది. గతంలో రెండు సార్లు ఫైనల్ చేరినా విజయం సాధించలేని భారత్, ఈసారి విజయం సాధిస్తుందో లేదు చూడాలి.




