శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షంలో కూర్చునేందుకు బీజేపీకి అవకాశం లేదని, కానీ.. మీరు మాత్రం అధికార పక్షం వైపు రావచ్చని సరదాగా వ్యాఖ్యానించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే వీడ్కోలు కార్యక్రమంలో సీఎం ఫడ్నవీస్ ఈ విధంగా స్పందించారు. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కూడా పక్కనే ఉన్నారు.