
విటమిన్ D సప్లిమెంట్స్ వాడే వారికి అలర్ట్
విటమిన్ D ఎముకల బలం, ఇమ్యూనిటీ, ఆరోగ్యానికి కీలకం. అయితే, డాక్టర్ సలహా లేకుండా సప్లిమెంట్స్, షాట్స్, పిల్స్ వాడడం ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్లడ్లో కాల్షియం అధికం అవ్వడం, కిడ్నీ, గుండె, ఎముకలకు హాని కలిగిస్తుంది. హైపర్పారాథైరాయిడిజం, సార్కాయిడోసిస్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులు సరైన డోస్. రోజుకు 4,000 IU కంటే ఎక్కువ డోస్ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా తీసుకోకూడదని సూచిస్తున్నారు.




