ఆధార్ కార్డుపై UIDAI కీలక అప్‌డేట్ ఇచ్చింది. తాజా నిబంధనల ప్రకారం, ఆధార్‌లో ఉన్న పుట్టిన తేదీ (DOB) అధికారిక ధృవీకరణ పత్రంగా పరిగణించబడదని తెలిపింది. ఆధార్ కార్డు కేవలం గుర్తింపు (ID), చిరునామా (Address) రుజువుగా మాత్రమే ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. కార్డుపై ఉన్న DOB అనేది యూజర్ సమర్పించిన ఇతర పత్రాల ఆధారంగా నమోదు చేస్తారని పేర్కొంది. ఏదైనా వివాదం తలెత్తితే, నిజమైన పుట్టిన తేదీని నిరూపించుకోవాల్సిన బాధ్యత కార్డుదారుడిదేనని యూఐడీఏఐ వెల్లడించింది.