
తెలంగాణ ఇంటర్ సిలబస్‌లో మార్పులు.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
తెలంగాణ విద్యాశాఖ ఇంటర్మీడియట్ సిలబస్‌లో కీలక మార్పులు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి రానున్న ఈ మార్పుల ద్వారా విద్యార్థులపై చదువుల భారం తగ్గించి, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సాంకేతిక అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త పాఠ్యపుస్తకాలు బహుళ రంగుల్లో ముద్రించి, డిజిటల్ కంటెంట్ కోసం క్యూఆర్ కోడ్‌లను అనుసంధానించారు. అన్ని సబ్జెక్టుల్లోనూ అంతర్గత మూల్యాంకనం లేదా ప్రాక్టికల్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. హ్యుమానిటీస్ సబ్జెక్టులను విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించేలా రీడిజైన్ చేశారు.




