ఎన్నికల ఖర్చు భరించలేక.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

82చూసినవారు
ఎన్నికల ఖర్చు భరించలేక.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
TG: సర్పంచ్ బరిలో నిలబడిన ఓ అభ్యర్థి, ఎన్నికల ఖర్చు భరించలేక బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్(M) పెదరాస్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా BRS పార్టీ మద్దతుతో బొమ్మెర రాజన్న పోటీ చేశారు. అయితే, క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు భారీగా డబ్బులు పంచుతున్నారని, తన వద్ద పంచడానికి డబ్బులు లేవని రాజన్న మనోవేదనకు గురయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో బుధవారం గడ్డి మందు తాగాడు. ​ప్రస్తుతం రాజన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్