TG: శంషాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సిద్ధేశ్వర కాలనీకి చెందిన బూర నర్మద (19), సిద్ధార్థ బేజనీ గౌడ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో 15 రోజుల క్రితం సిద్ధార్థ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి నర్మద తీవ్ర మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఆమె మృతి చెంది ఉంది. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.