TG: సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. లలిత(56) అనే మహిళ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మానేరు వాగులో ఆమె మృతదేహం లభ్యమైంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె కుమారుడు అభిలాష్ (కానిస్టేబుల్) తట్టుకోలేక అదే వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.