ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలికి ఎంగేజ్‌మెంట్ అయిందనే విషయం తెలిసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సారథినగర్ జూబ్లీపురకు చెందిన సాయితేజ(17) స్థానికంగా ఉండే బాలిక (16)తో ప్రేమలో ఉన్నాడు. అయితే వీరి ప్రేమను అంగీకరించని బాలిక తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేశారు. ఈ విషయం తెలిసి మనస్థాపానికి గురైన సాయితేజ ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు