AP: తూర్పు గోదావరి జిల్లా అర్తమూరుకు చెందిన ఐదో తరగతి చదివిన రైతు సత్తి శివనారాయణరెడ్డి, మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న తన భార్య కష్టాన్ని తీర్చడానికి ఇంట్లోనే ఒక ఎస్కలేటర్‌ను తయారు చేశారు. సుమారు రూ.70 వేల ఖర్చుతో, 1.5 హెచ్‌పీ మోటార్, ఇతర పరికరాలతో ఆయన ఈ వినూత్న యంత్రాన్ని రూపొందించారు. ఇది తక్కువ విద్యుత్‌తో 300 కిలోల బరువును మోయగలదు. భద్రతా ఏర్పాట్లతో దీనిని నిర్మించారు.