భార్య టార్చర్‌ తట్టుకోలేకపోతున్నా.. చావడానికి అనుమతివ్వండని భర్త వేడుకోలు

43చూసినవారు
భార్య టార్చర్‌ తట్టుకోలేకపోతున్నా.. చావడానికి అనుమతివ్వండని భర్త వేడుకోలు
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వ్యక్తి తన భార్య వేధింపులు భరించలేక కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించిన ఘటన చర్చనీయాంశమైంది. కిరీట్ పటేల్ అనే వ్యక్తి, తన భార్య మహిళల రక్షణ చట్టాలను దుర్వినియోగం చేస్తూ తరచూ ఫిర్యాదులు చేసి ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించాడు. తన కుమారుడికి కూడా ప్రమాదం కలిగించే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నాడు. భరణం, గృహహింస కేసుల పేరుతో తనపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయాడు. సమస్యకు పరిష్కారం లేకపోవడంతో కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్