AP: కొడుకు మృతిని తట్టుకోలేక ఆ తల్లి గుండె పగిలిపోయింది. బిడ్డ లేని ఈ లోకంలో ఉండలేనని మనస్తాపం చెంది ఓ చెట్టుకు ఉరేసుకుంది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. కంబదూరుకు చెందిన వడ్డె హనుమంతరాయుడు, అనిత దంపతులకు అజయ్ (16) అనే కుమారుడు ఉన్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి ఓ వ్యవసాయ క్షేత్రంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లాడు. ఈత రాక నీటిలో మునిగిపోయాడు. విగత జీవిగా ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించింది. సమీపంలోని కొండలోకి వెళ్లి చీర కొంగుతో చెట్టుకు ఉరేసుకుంది.