AP: తూర్పుగోదావరి జిల్లా, పాతతుంగపాడులో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం చనిపోయిన తల్లిని మర్చిపోలేక లక్ష్మణరావు అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే దివ్యాంగురాలైన తన భార్యను ఒంటరిగా వదిలేయలేక, ముందుగా ఆమెను చంపి అనంతరం తాను ఉరివేసుకున్నాడు. చనిపోవడానికి ముందు లక్ష్మణరావు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా ఈ వివరాలు వెల్లడైనట్లు CI వీరయ్య తెలిపారు.