మీ కలలను నెరవేర్చలేకపోతున్నా.. NEET విద్యార్థి సూసైడ్

0చూసినవారు
మీ కలలను నెరవేర్చలేకపోతున్నా.. NEET విద్యార్థి సూసైడ్
'అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి' అంటూ ఓ NEET విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన యూపీలో చోటు చేసుకుంది. NEET పరీక్షలో ఫెయిలైనందుకు మహమ్మద్ ఆన్(21) అనే విద్యార్థి రావత్‌పూర్ లోని హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 'అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి. నేను చాలా ఒత్తిడిలో ఉన్నా. మీ కలలను నెరవేర్చలేకపోతున్నాను. నేను చనిపోతున్నా. దీనికి పూర్తిగా నేనే బాధ్యుడిని' అని రాసి ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్