
హైకోర్టు ఆదేశాలకి విరుద్దంగా టికెట్స్ అమ్మిన నిర్మాతలు.. బెంచ్ సీరియస్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ 2' సినిమా టికెట్ ధరల వివాదంలో చిక్కుకుంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం, ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి అధిక ధరలకు టికెట్లు విక్రయించినందుకు నిర్మాతలపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని సింగిల్ బెంచ్ ప్రశ్నించింది. ఆన్లైన్లో పెంచిన ధరలకు టికెట్లు అమ్మడంపై బుక్‌మై షోను కూడా కోర్టు ప్రశ్నించింది.




