ఆసీస్‌పై అండర్-19 భారత యువ జట్టు క్లీన్‌స్వీప్

16280చూసినవారు
ఆసీస్‌పై అండర్-19 భారత యువ జట్టు క్లీన్‌స్వీప్
ఆస్ట్రేలియా పర్యటనను భారత అండర్-19 జట్టు విజయవంతంగా ముగించింది. యూత్ వన్డే, టెస్టు సిరీస్‌లలో ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం మెకేలో ముగిసిన రెండో యూత్ టెస్టులో అయూష్ మాత్రే సారథ్యంలోని జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 81 పరుగుల లక్ష్యాన్ని 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు వన్డే సిరీస్‌ను 3-0తో, టెస్టు సిరీస్‌ను 2-0తో భారత్ గెలుచుకుంది.

సంబంధిత పోస్ట్