
కేతన్ హత్య కేసు.. మ్యారేజ్ షాపింగ్ కోసం రూ.కోటి తీసుకున్న సియా
పుణెకు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా గోయల్ మ్యారేజ్ షాపింగ్ కోసమని కాబోయే భర్త కేతన్ నుంచి దాదాపు కోటి రూపాయలు తీసుకుందని పోలీసులు తెలిపారు. అయితే ఆ మొత్తం డబ్బును ప్రియుడు చేతన్ బిజినెస్ కోసం ఇచ్చేసిందని చెప్పారు. మర్డర్ తర్వాత అనుమానం రాకుండా మూడేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలని ప్లాన్ వేశారని వెల్లడించారు.




