AP: వైఎస్ జగన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. షేర్ల బదిలీపై హైదరాబాద్ NCLT ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల చెన్నై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. గిఫ్ట్ డీడ్‌లో షేర్లు పూర్తిగా బదిలీ కాలేదని, అవి జగన్ వద్దే ఉన్నాయని హైదరాబాద్ NCLT గతంలో తీర్పు ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన చెన్నై ట్రిబ్యునల్, హైదరాబాద్ NCLT ఉత్తర్వులపై స్టేటస్ కోవిధించింది.