TG: విద్యార్థుల యూనిఫాంపై సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆకర్షణీయమైన రంగుల్లో యూనిఫాం రూపొందించాలని చెప్పారు. వచ్చే ఏడాది స్కూళ్లు తెరిచే రోజే యూనిఫాం అందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ ఏడాది జత యూనిఫాం పంపిణీ పూర్తైందన్నారు. నెలాఖరులోగా KGBV, మోడల్ స్కూల్ విద్యార్థులకు 2 జతల యూనిఫాంలు పంపిణీ చేయాలని చెప్పారు.