
నేటితో ముగియనున్న గ్యాస్ సబ్సిడీ, ఐటీ నోటీసుల గడువు!
జూన్ 30వ తేదీతో అనేక ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలకు గడువు ముగియనుంది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయకపోతే, కేంద్రం ఇచ్చే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోనుంది. ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఈకేవైసీ పూర్తి చేయాలి. మరోవైపు, ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 143(2) కింద పరిశీలన నోటీసులను జారీ చేయడానికి నేడే చివరి తేదీ. పన్ను అధికారులు గుర్తించిన వ్యత్యాసాలు, అసాధారణ లావాదేవీలు, ఆదాయ నివేదనలో తేడాలు వంటి వాటిపై ఈ నోటీసులు జారీ కానున్నాయి.




