బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. కేటీఆర్‌కి కేంద్ర మంత్రి బండి సంజయ్ కరెక్ట్ అని ఆయన అన్నారు. కేసీఆర్ గురించి మర్యాదగా మాట్లాడాలని చెబుతూ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఎందుకు మర్యాద మరిచారని దయాకర్ ప్రశ్నించారు. ఇకపై కేటీఆర్ మాట్లాడిన భాషతోనే సమాధానం చెబుతామని, కేటీఆర్‌తో తిట్ల పోటీకి తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చర్చిద్దామని, పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ అంటే బీఆర్ఎస్ కు భయం పట్టుకుందని కూడా ఆయన ఆరోపించారు.