
ఛార్మీతో రిలేషన్ పై ఘాటుగా స్పందించిన పూరి
దర్శకుడు పూరి జగన్నాథ్ నటి ఛార్మీతో తనకున్న సంబంధంపై వస్తున్న పుకార్లకు ఘాటుగా స్పందించారు. తనకు 13 ఏళ్ల వయసు నుంచే ఛార్మీ తెలుసని 20 ఏళ్ల స్నేహంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ఛార్మీ యువతి, పెళ్లికానిది కాబట్టే తమపై ఇలాంటి అనుమానాలు వస్తున్నాయని, పైపై ఆకర్షణలు శాశ్వతం కాదని స్నేహమే శాశ్వతమని పూరి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పూరి దర్శకత్వంలో విజయ్ సేతుపతి సినిమాకు ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.




