శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (వీడియో)

19162చూసినవారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అభిషేక సేవతో పాటు వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో కూడా ఆమె పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆమెకు స్వాగతం పలికారు. దర్శన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించిన ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్